Take a fresh look at your lifestyle.

‘ఆశా ది గ్రేట్’ కన్నుమూత బాధాకరం

 

ఏడు దశాబ్దాలపాటు భారతీయ సంగీత ప్రియులను తన అజరామరమైన గాత్ర మాధుర్యంతో ఓలలాడించిన మహోన్నత గాయని ఆశా బోన్సులే మరణం బాధాకరం. హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో  ఆశా బోన్సులే పాడినన్ని వైవిద్య భరితమైన పాటలు దేశంలో మరే ఇతర గాయని పాడలేదు. నేను నటించిన అశ్వమేధంలో ఆశాబోన్సులే రెండు యుగళ గీతాల్లో పాడారు.
ఓపి నయ్యర్, ఆర్ డి బర్మన్ సంగీత దర్శకత్వం లో ఆశాజీ పాడిన అద్భుతమైన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచి పోతాయి. పద్మ విభూషణ్తో సహా ఎన్నో అవార్డ్స్ ఆమె సొంతం అయ్యాయి. ఇప్పట్లో మరో ఆశాజీని చూడలేము. అందుకే ఆమె ఆశా ది గ్రేట్.
ఆశా బోన్సులే గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

నందమూరి బాలకృష్ణ
శాసన సభ్యులు
హిందూపురం

Leave A Reply

Your email address will not be published.