రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: ఆరోగ్యంగా ఆనందమయ జీవితాన్ని గడపడానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ తెలిపారు. శనివారం పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ పాల్గోని మాట్లాడారు.ఒత్తిడి,ఆందోళనలతో సతమతమవుతున్న నేటి యువత దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్, బంగారి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కళాధర్ రెడ్డి,పద్మ, ఈశ్వరచారి తదితరులు పాల్గొన్నారు.