మహేశ్వరం, ముద్ర ప్రతినిధి: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలోని నివాసంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భీమిడి జంగా రెడ్డి తన అనుచరులతో కలిసి, శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కి భీమిడి జంగా రెడ్డితో పాటుగా, సామ సుదర్శన్ రెడ్డి తదితరులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు.