Take a fresh look at your lifestyle.

విద్యతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను బోధించడం అభినందనీయం

  • ఎమ్మెల్యే డా . సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విద్యతోపాటు భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను సైతం బోధించడం అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో వాల్మీకి ఆవాసంలో నిర్వహిస్తున్న విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ సంబరాలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ గీత విద్యాలయం, వాల్మీకి ఆవాసంకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. అలాగే జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్, ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల మైదానం వాకర్స్ అసోసియేషన్, విద్యానగర్, పద్మనాయక కళ్యాణ మండపం, శ్రీనగర్ కాలనీలో పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం అభినందనీయం ప్రతి ఒక్కరూ వారి వారి సంస్క్రుతి సాంప్రదాయాలను రక్షిస్తూ ఇతర మతల వారిని గౌరవించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు క్రీడా రంగాల్లో తెలంగాణ క్రీడాకారులు ఇతర రాష్ట్రాల క్రీడాకారుల వలే సత్తా చాటే విధంగా క్రీడాకారులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో ఏడాదిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.200 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాల పట్టణ అభివృద్ది లో ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి,ఆవాస అధ్యక్షులు పురుషోత్తం, సీనియర్ వైద్యులు డా.శంకర్,కార్యదర్శి మదన్ మోహన్ రావు,అశోక్ రావు ,సంపూర్ణ చారి,కైలాసం,మధుకర్, మహిపాల్ రెడ్డి ,హరీష్,లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరావు ,మల్లేశం ,కాశీరాం, నాయకులు ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.