- 30 రోజులు, 200 ఎపిసోడ్స్.
- ఏప్రిల్ ఒకటవ తేది నుండి ప్రసారాలు.
- రాష్ట్ర బడ్జెట్, ఆర్ధిక సర్వే పైనా స్పెషల్ లెసన్స్.
- సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి.
మాదాపూర్, ముద్ర : ఎప్ సెట్, పాలిసెట్ 2025 విద్యార్థుల కోసం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ డిజిటల్ లెసన్స్ ప్రసారం చేయనున్నాయి. రాష్ట్ర బడ్జెట్, ఆర్ధిక సర్వే పైనా ప్రత్యేక అవగాహన ప్రసారాలు సైతం ఏప్రిల్ ఒకటవ తేది నుండి 30వ తేది వరకు కొనసాగనున్నాయి. డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన వివరాలను సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వెల్లడించారు. మే రెండవ తేది నుండి ఐదవ తేది వరకు జరిగే ఎప్ సెట్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ మరియు జువాలజీ సబ్జెక్ట్ ల్లో అరగంట నిడివిగల మూడు పాఠ్యాంశాలు 30 రోజులు 90 ఎపిసోడ్స్ టి-సాట్ విద్య ఛానల్ ఉదయం ఆరున్నర నుండి ఎనిమిది గంటల వరకు, నిపుణ ఛానల్ సాయంత్రం ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రసారమౌతాయని, ఇంజనీరింగ్ అండ్ నీట్ విద్యార్థులు సైతం డిజిటల్ లెసన్స్ ఉపయోగించుకోవచ్చని సీఈవో సూచించారు.పాలిసెట్ 2025: పాలిసెట్ విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్టీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లలో రోజు రెండు గంటల పాటు నిపుణ ఛానల్ ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు,అవే పాఠ్యాంశాలు విద్య ఆరున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు సాయంత్రం అరగంట నిడివిగల పాఠ్యాంశాలు 60 ఎపిసోడ్స్ 30 రోజులు ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రాష్ట్ర బడ్జెట్-ఆర్దిక సర్వే పై: విద్యా సంభందిత కార్యక్రమాలు రూపొందించే టి-సాట్ నెట్వర్క్ రాష్ట్ర బడ్జెట్ పై ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి ప్రసారం చేయనుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తాజా శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించిన ఆర్థిక సర్వే, 2025-26 బడ్జెట్ లోని సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఆర్థిక సర్వేలో వెల్లడైన అంశాలతో పాటు, బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు, రెవెన్యూ రాబడి, వ్యయాలతో పాటు పూర్తి వివరాలు ఇందులో ఉంటాయని, ఐదు భాగాలుగా రూపొందించిన పాఠ్యాంశాలు ఏప్రిల్ ఒకటో తేది నుండి నిపుణ ఛానల్ ఉదయం ఎనిమిది గంటలకు, తిరిగి విద్య చానల్ మరుసటి రోజు ఉదయం పదిగంటలకు ప్రసారమౌతాయన్నారు.పోటీ పరీక్షలకు ఎంతోగానో ఉపయోగపడే ఈ పాఠ్యాంశాలను విధ్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉపయోగించుకోవాలని, గతంలోనూ కేంద్రబడ్జెట్ పై ప్రసారాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. సీఈఓ వేణుగోపాల్ రెడ్ది టి -సాట్ ప్రేక్షకులకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.