Take a fresh look at your lifestyle.

విద్యా రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలి కలెక్టరేట్ ఎదుట టీపిటిఎఫ్ ఆందోళన

ముద్ర ప్రతినిధి, మెదక్:
విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పదే పదే చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈ బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే కేటాయించి నిరాశ పరిచిందని
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొంగోటి యాదగిరి, పి. వెంకట్రామి రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా విద్యారంగానికి 20 శాతంగాని, తెలంగాణ విద్యా కమిషన్ సూచించినట్లు 18 శాతంగాని, కనీసం కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా 15 శాతం కూడా బడ్జెట్ లో ప్రకటించక పోవడం వలన ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదని అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


పాఠశాలలో ప్రైమరీ తరగతుల నిర్వహణ, విద్యార్థుల కిట్, బ్రేక్ ఫాస్ట్ పథకాలను ఈ విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, ఇంత తక్కువ బడ్జెట్ల్ కారణంగా పథకాలు ప్రకటనలకే పరిమితం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పిఆర్సిని వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
రెగ్యులర్ డీఈఓ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఎంఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పూర్వప్రాథమిక పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డి.ఏలను విడుదల చేయాలని, రిటైర్డు ఉద్యోగ, ఉపాద్యాయుల బకాయిలను ఏక కాలంలో చెల్లించాలన్నారు. డైట్లలోని లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని జిల్లాలను ఇఎల్టిసి కేంద్రాలను ప్రారంభించి ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రంను కలెక్టరేట్ కార్యాలయ ఏఓ యూనస్ కు అందజేశారు.

ఈ ఆందోళనలో   రాష్ట్ర మాజీ అధ్యక్షులు   కొండల్ రెడ్డి,  రాష్ట్ర మాజీ కార్యదర్శి  రామ్ కిషన్, నాయకులు  నీల కంఠం, గోపాల్,యాదగిరి, మొఇజోద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, సాయి బాబా, రాజయ్య, దేవి సింగ్, సురేందర్,శ్రీనివాస్ జాదవ్, సంగయ్య, హీరా లాల్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, నజీరోద్ధిన్, అల్వాల్ రమేష్, మధు సూదన్,శశిధర్ రెడ్డి,జె. రామ్ చంద్రం, ముత్యాలు,
పిండి నాగరాజు, నర్సింగం, చాంద్ పాషా, మహ్మద్ అమీరుద్దీన్, కిరణ్ కుమార్, మల్లేశం, చౌదరి మాధవ్, రాజశేఖర్, మురళి, శ్రీనివాస్ నాగభూషణం, కమ్మరి శ్రీనివాస్, రమేష్, కొమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.