Take a fresh look at your lifestyle.

మహాత్మా జ్యోతిరావు పులేకు ఘన నివాళి

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):

శనివారం మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్బంగా కొంగర కలాన్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి కేషు రాం, బిసి సంఘం నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబా పూలే అని నేటితరం వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకొని మహిళా విద్యకు పెద్ద పీట వేయాలని బి.సి. సంక్షేమ శాఖ అధికారి కేషురాం కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ జి మలేష్ యాదవ్, పీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్, రంగారెడ్డి జిల్లా బీసీ ఫ్రంట్ అధ్యక్షులు కే కృష్ణ యాదవ్, జంగయ్య, బీసీ వెల్ఫేర్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.