Take a fresh look at your lifestyle.

కేదారినాథ్ లో దక్షిణ భారత ఏకైక తెలుగు లంగర్-కేదారినాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు మధుసూదన్

* శాశ్వత బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం
* ఈ నెల 22 నుండి యాత్ర ప్రారంభం అవుతుంది

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

మంచు కొండల్లోని కేదార్ నాథ్ వద్ద 6వ సారి అన్న ప్రసాదం అందించడానికి ఈనెల 14న సరుకుల లారీనీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు జండా ఊపి ప్రారంభిస్తారని కేదార్ నాధ్ అన్నదాన సేవాసమితి అధ్యక్షులు చీకోటి మధుసూదన్ తెలిపారు. శనివారం దాస ఆంజనేయ దేవాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేదార్ నాథ్ దర్శనానికి వచ్చే భక్తులకు దక్షణాది రుచులతో మంచి భోజనాన్ని అందించే ఏకైక లంగర్ ను సిద్దిపేట కేదార్ నాధ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా భక్తులకు భోజనంతోపాటు, సమాచార కేంద్రం ద్వారా సమాచారాన్ని, అవసరమైన వారికి కొన్ని రకాల ట్యాబ్లెట్లను అందిస్తూ, తెలుగువారి ఆప్యాయతను భక్తులకు పంచినట్లు తెలిపారు. ఈనెల 14న స్థానిక శరభేశ్వర దేవాలయం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించి, సోన్ ప్రయాగ వద్ద ఉన్న లంగర్ కు సరుకులతో కూడిన లారీని పంపించనున్నట్లు తెలిపారు. గతంలో సోన్ ప్రయాగ వద్ద భోజనం అందించే వారమని, కేదార్నాథ్ గుడికి దగ్గరలో మరో లంగర్ ను కూడా ఏర్పాటు చేసి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు వచ్చే భక్తులకు ఆహార పదార్థాలు రుచికరంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం టి, బిస్కెట్స్, టిఫిన్, మధ్యాహ్నం రుచికరమైన ఆహారం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 మంది సభ్యుల సహకారంతో ఈ సేవ చేస్తున్న మంది తెలిపారు. 14న జరిగే కార్యక్రమానికి తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు వస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అయిత రత్నాకర్, పబ్లిక్ రిలేషన్ డా. మాంకాల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు కాచం కాశినాథ్, గంజి రాములు, జిల్లా శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు నల్లా నాగరాజం, గుబ్బ లింగమూర్తి, సభ్యులు గంప శ్రీనివాస్, అయిత ప్రభాకర్, చొల్లేటి నాగభూషణం, చింత రాజేంద్రప్రసాద్, గట్టు తిరుపతి కిషోర్, కొండూరు శ్రీనివాస్, బెజుగామ సత్యనారాయణ, సోమ ఉమా మహేశ్వర్, కుంచం కాధినాథ్, రాజూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.