మల్కాజిగిరి, ముద్ర విలేఖరి: సర్దార్ పటేల్ నగర్ లోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం లలో మౌలిక వసతులు కల్పించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విన్నతీపత్రం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి సర్దార్ పటేల్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం లలో మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల ఆవరణంలో బాత్రూంలు నిర్మించాలని, పాఠశాల పిల్లలు ఆహారం తయారు చేయుటకు వంటగది నిర్మించాలని, మంచి నీటి వసతి కోసం బోరు బావి వేయించాలని అంగన్వాడి భవనంలో బయట ప్రదేశంలో ఫ్లోరింగ్ చేయించాలని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు అశోక్ గౌడ్, అంగన్వాడి టీచర్లు సునీత, కళ్యాణి, మౌనిక, ఆశా వర్కర్ సునీత, సర్దార్ పటేల్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాములు, శ్రీకాంత్, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.