ముద్ర కాప్రా:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో 59వ స్థాపన దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. సంస్థ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తాత్కాలిక సీఎండ్‌ఎండీ & డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ప్రోటీక్ కుమార్ చక్రబోర్టి, ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ.ఎస్.రావు విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈసీఐఎల్ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యోగులు, టీఓసీలు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని అభినందించారు. అందరికీ 59వ స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “వికసిత భారత్” లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి తన వంతు కృషి చేయాలని ఆయన కోరారు