కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చెయ్యాలి. -వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి.
మోత్కూరు ముద్ర న్యూస్:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.నిరంకుశ పాలనను నిరశిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం మోత్కూర్ పట్టణం అంబేద్కర్ చౌరాస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు, పాషిస్ట్ నిరంకుశ పాలనను నిరషిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మె కేవలం కార్మిక సంఘాల హక్కులకు సభందించినది మాత్రమే కాదని,దేశ ప్రజలందరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారాల కోసం జరుగుతుందని అన్నారు. రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కొత్త విత్తన చట్టం, నూతన విద్యుత్ బిల్లు చట్టం సవరణ తేవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ కార్మికుల పనిహక్కును కాల రాస్తుందని, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాచకొండ రాములమ్మ, సీఐటీయూ మండల నాయకులు మెంట ఎల్లయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ కె శ్రీను, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరెళ్ళ నరసింహ తదితరులు పాల్గొన్నారు.