ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట, నంగునూర్, చిన్నకోడూరు, కొండపాక మండలశాఖల ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ను యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ,హైదరాబాద్ వారి సౌజన్యముతో నిర్వహించారు.ఈ సందర్బంగా డాక్టర్ అభిషేక్ బార్లీ మాట్లాడుచు ఎముకల అరుగుదల పట్ల అశ్రద్ద వహించకుండా వైద్యుల సూచన మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వైద్య శిబిరములో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాగుల రాజిరెడ్డి,జైన సత్యం, రామకిష్టయ్య, సిద్దిపేట, నంగునూర్,కొండపాక మండలాల అధ్యక్షులు మహంకాళి, భూంరెడ్డి, గాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మల్లేశం, రాం రెడ్డి, వీరయ్య, రత్నాకర్ రెడ్డి, ముత్యం రెడ్డి, జానకిరాములు, కృపాసాగర్ పాల్గొన్నారు.
వైద్య శిబిరములో 98 మందికి గుండె, ఆర్థోపెడిక్, BMD తదితర వైద్య పరీక్షలు నిర్వహించినారు.
వీరిలో సుమారు 16మందికి మోకీలు మార్పిడి చేయించుకోవాలని సూచించారు