జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి
పట్టణంలో 50 వార్డుల్లో వార్డు సభల నిర్వహణ
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు చేరే విధంగా ఉపయుక్తంగా మారిందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 50 వార్డుల్లో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వార్డు స్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ సభల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను నమోదు చేసి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, కౌన్సిలర్లు, వార్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.