- మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పంచాంగ శ్రవణం రాబోయే సంవత్సరానికి ఆశీర్వచనమని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటి ప్రతి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఉగాదిని పురస్కరించుకొని శ్రీమాన్ వేణుగోపాల చార్య కౌశిక ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూగత సంవత్సరం కన్నా ఈ ఏడాది అన్ని రంగాల్లో మరింత మెరుగ్గా ఉంటుందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, హిందూ బంధువులందరికీ శుభం కలుగాలని, విశ్వా వసు నామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమం కోసం మెరుగైన రీతిలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని దేశములో ప్రథమ స్థానంలో నిలుపుతున్నారని, పేద వారికి పట్టెడన్నం అందించేందుకు దేశంలో మొదటి సారిగా బియ్యం వినియోగించేలా వుండెలా సన్నరకం బియ్యం ఒక్కరికీ 6 కిలోలు అందిస్తుండటం శుభసూచకమన్నారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ప్రతి నిరుపేదకు అర్హత కార్డు.. అందరికీ సంక్షేమ ఫలాల అందించాలనే ధ్యేయం తో అర్హులందరికీ అందిస్తామన్నారు. నాలుగు దశాబ్దాల వివిధ హోదాల్లో ప్రజలకు సేవలు అందించాను.బాధ్యత గల పౌరుడిగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విషుశర్మ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ టి. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, డా. గురవరెడ్డి, బండ శంకర్, కొత్త మోహన్, రేపల్లె హరికృష్ణ, అల్లాల రమేష్ రావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
