అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల కరపత్రండాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట శాసనసభ్యులు సతీమణి చిక్కుడు అనురాధ CBM ట్రస్ట్ చైర్మన్ జెడ్పిటిసి మరియు అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు విడుదల చేశారు,ఈ సందర్భంగా చిక్కుడు అనురాధ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మన అచ్చంపేటలో అంబేద్కర్ చౌరస్తాలో గత 40 సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం అంబేద్కర్ కు ఘన నివాళులర్పించడం అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అందరికీ విద్య అందరి పట్ల సోదర భావం స్నేహభావం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేశారని అంబేద్కర్ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని , అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా లో జరిగే ఉత్సాహాలు ఘనంగా జరిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాతుకుల శ్రీశైలం అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు ,ఎంపీపీ అచ్చంపేట భర్త లోక్య నాయక్ ,మాజీ ఎంపీపీ రామనాథం, మాజీ సర్పంచ్ హరిచంద్ర, బిసమల్ల ఆనంద్, కౌన్సిలర్లు సునీత, రాములు, రాఘవులు, కుంద మల్లికార్జున, రాజగోపాల్, కొంకి విజయ్, మండారి పర్వతాలు, తిరుమల పరమేశ్వర్ ,మీసాల ప్రభాకర్, రాజు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.