Take a fresh look at your lifestyle.

చిన్నారి పై అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి

 

మహదేవపూర్, ముద్ర:

మహాదేవపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 22వ తారీఖున మైదానంలో ఆడుకుంటున్న చిన్నారిని మాయ మాటలు చెప్పి ఇద్దరు మైనర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రౌండ్లో ఆడుకుంటున్న చిన్నారికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పి రహస్య ప్రదేశమునకు తీసుకొని వెళ్లి 9వ తరగతి మరియు ఏడవ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలురు అఘాయిత్యానికి పాల్పడగా, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే రంగంలోకి జరిగిన పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పూర్వాపరాలు విచారిస్తున్నారు. కాటారం డిఎస్పి సూర్యనారాయణ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.