Take a fresh look at your lifestyle.

సంఘ భవనానికి స్థలం కేటాయించండి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య భవనానికి స్థలం కేటాయించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుకు వినతిపత్రం అందజేశారు. డిసిసి ప్రధాన కార్యదర్శి గాజుల రవి కుమార్ నేతృత్వంలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమావేశానికి సంఘ భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి స్థలాన్ని కేటాయించేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇందులో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగన్న, లక్ష్మణ్, కోశాధికారి ముత్యం, భీమయ్య, రాజేశ్వర్, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.