మంద కృష్ణ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ సంతోష్
సిద్దిపేట,ముద్ర ప్రతినిధి :
ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది అంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ సంతోష్, ఉపాధ్యక్షులు నరేష్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి మాదిగ ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. మాదిగ ఉద్యోగులు, మేధావులు అని చెప్పుకుంటూ ఈనెల 6న హైదరాబాద్లోని శిల్పకళా తోరణం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని.. ఈ సన్మాన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పాల్గొనడం లేదని తెలిపారు. అలాగే ఎమ్మార్పీఎస్ కు అనుబంధంగా ఉన్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు గానీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గాని ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దు అని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి రాజు, నాయకులు మల్లిగారీ యాదగిరి, నాగరాజు కిష్టయ్య పలువురు పాల్గొన్నారు.