ముద్ర : కాప్రా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అవిశ్రాంతంగా పోరాడి, ప్రజల స్వాభిమానాన్ని సంపాదించుకున్న మహోన్నత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ , నాచారం, కాప్రా, మల్లాపూర్ ,కుషాయిగూడ ,చర్లపల్లి ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మల్లాపూర్ నోమ సర్కిల్ సమీపంలో మొక్కల నాటారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ తో పాటు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించాలనే సంకల్పంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలలో మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ లో దేవేందర్ రెడ్డి, కొత్త రామారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

మల్కాజిగిరిలో
బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను మల్కాజిగిరి, నేరేడుమెట్ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో మహోన్నత పాత్ర పోషించిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిగా కొనియాడారు. వేడుకల్లో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పరుశురామిరెడ్డి స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.