ముద్ర, శేరిలింగంపల్లి:
కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో గల శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వైట్ ఫీల్డ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మెరుకు ఈ రోజు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగిందని, వైట్ ఫీల్డ్ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, రోడ్డు విస్తరణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పాఠశాలలు, కళశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని , రోడ్డు ఆక్రమణ ల పై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. వైట్ ఫీల్డ్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, రోడ్లు, డ్రైనేజి, స్ట్రీట్ లైట్స్ మరియు ఇతర మౌలిక వసతుల పై అసోసియేషన్ సభ్యులతో చర్చించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చైర్మన్ గాంధీ తెలియచేసారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పనులు పై అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను తక్షణమే తొలగించి, అవసరమున్న చోట రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ గోవర్ధన్, DE దుర్గాప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఎసీపీ కరుణాకర్, టీపీఎస్ సంతోష్, ఎస్.డబ్ల్యూ.ఎం డీఈ రూపాదేవి, ఏఈ మన్యం, ఎస్.ఆర్.పి కిరణ్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.