- దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఆదివాసి,నాయక్ పోడు సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని గుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఈ నెల 20 న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే గాంధారి మైసమ్మ తల్లి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,పిన్నింటి రఘునాథ్ రెడ్డి,వోడ్నాల శ్రీనివాస్,ఆలయ కమిటీ సభ్యులు సమ్మయ్య,రాజన్న,తిరుపతి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.
