Take a fresh look at your lifestyle.

అంబులెన్స్ కోసం దారికి మరమ్మత్తులు చేయండి

  •  ర్యాంపు విషయమై మంత్రికి వివరిస్తున్న గోల్కొండ జగదాంబి ఆలయ చైర్మన్ కే చంటిబాబు.

మెహిదీపట్నం ముద్ర : గోల్కొండలో తిష్ట వేసిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గోల్కొండ జగదంబ ఆలయ చైర్మన్ కే చంటిబాబు అన్నారు. ముఖ్యంగా గోల్కొండ కోటలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఏటవాలు ర్యాంపుల విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ.. నాగదేవత ఆలయం దాటగానే ర్యాంపు ప్రాంతం పూర్తి ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో పూర్తిగా కోతలకు గురై దెబ్బతిన్నది అన్నారు. అంబులెన్స్లు కోటపైకి వెళ్లాలంటే ఈ ఒక్క దారే ఉందన్నారు. ఈ ర్యాంపు దెబ్బ తినడం వల్ల అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ అధికారులు మాత్రం కోతకు గురైన ప్రాంతాల్లో తాత్కాలికంగా మట్టిని పోస్తామన్నారని చెప్పారు. ఈ మట్టి మళ్లీ కొట్టుకుపోవడంతో సమస్య పునరావృతం అవుతుందని వెంటనే ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే పూర్తి పైన కొండ ప్రాంతంలో మూత్రశాలలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పురావస్తు శాఖ వారు అనుమతులు ఇవ్వడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు.ఆయన వెంట సభ్యులు ఆకుల శేఖర్, నాగులపల్లి శ్రీకాంత్, ప్రదీప్ కుమార్, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.