- ధాన్యానికి నిప్పంటిచ్చి నిరసన తెలిపిన రైతులు.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వరి ధాన్యానికి వ్యాపారులు తరుగు పేరుతో కోతలు విధిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారని అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరులో కూడలి లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.దిగుబడులు తగ్గి నష్టాల్లో రైతులు ఉండగా వ్యాపారులు తరుగు పేరుతో క్వింటాలుకు పది నుండి పదిహేను కిలోల కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.వ్యాపారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు.జాతీయ రహదారిపై రైతులు బయటాయించి వడ్లకు నిప్పంటించి నిరసన తెలిపారు.పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు.రైతుల రాస్తారోకోతో జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.