- మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జగిత్యాలలోని నవదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుంకుమ పూజలో పాల్గొన్నారు.అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం అని, మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం అని అన్నారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ విచారణ చేసింది,ఈ రోజు కేటీఆర్ ఏసీబీ విచారిస్తోందన్నారు. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైంది.. రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురుచేసుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.పింఛన్లు పెంచలేదు, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని హామీల గూర్చి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో రూ.10 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్, గట్టు సతీష్, అల్లాల దామోదర్ రావు, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
