రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన కొండ్ర రవి కుటుంబానికి పట్టణ ఆటో యూనియన్ సభ్యులు గురువారం చేయూతనందించారు. స్థానిక కనకదుర్గ కాలనీలోని రవి నివాసంలో కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలను అందించారు. గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య,అధ్యక్షుడు సంపత్,ఉపాధ్యక్షు అంజయ్య,ప్రధాన కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.