- “లైలా” సినిమా ప్రమోషన్ లో భాగంగా బాబాకు ప్రత్యేక ప్రార్థనలు
- కుటుంబ సభ్యులతో కలిసి బాబాను దర్శించిన హీరో విశ్వక్ సేన్
షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం లో నీ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్. త్వరలో విడుదల కానున్న సినిమా లైలా విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ తను చిన్నతనం నుండి ఈ దర్గాకు వస్తుండేవాడినని ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజిగా ఉంది రాలేకపోయానని, తన చిత్రం లైలా విడుదల సందర్బంగా రావడం జరిగింది అని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా అని ఆయన వివరించారు.ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నదనీ లైలా చిత్రం ఫిబ్రవరి 14 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నదని తెలిపారు.అదేవిధంగా స్థానిక మీడియా అడిగిన ప్రశ్నకు సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా నటుడు పృధ్విరాజ్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో సినిమా బాయికాట్ చెయ్యాలని సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైందన్న వాటికి సమాధానం చెప్పడానికి నిరాకరించారు హీరో విశ్వక్ సేన్.