Take a fresh look at your lifestyle.

రూ.8లక్షల విలువ గల నగలు అపహరణ

ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ మండలం మంబోజిపల్లి సంతలో 5 తులాల బంగారు ఆభరణాలు చోరి అయిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కొల్చారంకు చెందిన భార్య భర్తలు చింతలగారి శ్రావణి, ప్రవీణ్ మెదక్ నుండీ తిరుగు ప్రయాణంలో మంబోజిపల్లి సంతలో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళారు. తమ వద్ద హాండ్ బ్యాగులో ఉన్న రూ.8లక్షల విలువ గల 5తులాల బంగారు నగలు నెక్లెస్ 2.5 తులాలు, నల్లపూసలు 2 తులాలు, మాటీలు, చెవి కమ్మలు అర తులం చోరి జరిగాయి. బాధితులు కొద్దిసేపటికి హ్యాండ్ బ్యాగ్ చూడగా కనిపించకుండా పోవడంతో బాధితులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై లింగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.