Take a fresh look at your lifestyle.

టాస్క్ ఫోర్స్ దాడి, 9 మంది అరెస్ట్

రూ.28, 296 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక కారు, 5 బైకులు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, మెదక్:

కౌడిపల్లి మండలం బుజరంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 9 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28, 296 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిని వడ్ల ఎల్లం, వంజరి మల్లేశం, ఉసికె దుర్గేష్, బక్క వీరేశం, మహంకాళి ప్రకాష్, గుడాల హరి, పనిముక్కలా రామ్ శశిధర్ గౌడ్, గంగారాం మల్లేశం, జాతీగరి కృష్ణగా పోలీసులు గుర్తించారు. వారిని కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Leave A Reply

Your email address will not be published.