Take a fresh look at your lifestyle.

ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.23.99 లక్షలు.

యాదగిరిగుట్ట, ముద్ర :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉంజల్ సేవను ఆలయ పురవీధులలో ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ నిత్య రాబడి లో భాగంగా శుక్రవారం రోజున రూ.23,99,920, ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, పవన్ కుమార్ శర్మ, శ్రీనాథ్ చార్యులు, కాండూరి వెంకటాచార్యులు, నరేష్ కుమార్ చార్యులు, అనిల్ కుమార్ చార్యులు, వినయ్ కుమార్ చార్యులు, సూపర్డెంట్ సురేందర్ రెడ్డి, ఇన్చార్జి వెంకటేష్, కొమ్మ గాని కుమార్, ఎస్పీఎఫ్ సిబ్బంది నందు నాయక్, కురుమూర్తి భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.