Take a fresh look at your lifestyle.

గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ,   గిరిజన సంక్షేమాధికారి నీలిమ

 

ముద్ర ప్రతినిధి, మెదక్:

గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ ఆధ్వర్యంలో  శిక్షణ  ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  వారి సమన్వయం, కేరళ రాష్ట్రంలోని కోచ్చి నందు గల నైపుణ్య శిక్షణాభివృద్ది సంస్థలో మే 2026లో ప్రారంభమయ్యే తదుపరి బ్యాచ్ కోసం తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన గిరిజన నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, మెదక్ జిల్లాలోని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి ఈనెల 10 లోపు సమర్పించాలన్నారు. కోర్సులు…

ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్, ఇండస్ట్రియల్ వెల్డర్,

ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్, ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్,

కోర్సు వ్యవధి  6 నెలలు ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.