Take a fresh look at your lifestyle.

అర్బన్ కాలనీ తో పేద వాడి సొంతింటి కల సాకారం

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

ముద్ర, జగిత్యాల టౌన్: నూక పెళ్లి అర్బన్ అర్బన్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పట్టణంలోని పేదవారి సొంతింటి కల సహకారమైందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో జగిత్యాల పట్టణ 17వ వార్డుకు చెందిన నిమిషకవి రమాకాంత్–మాధవిల నూతన గృహప్రవేశంకు గురువారం ఎమ్మెల్యే హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నో ఏళ్ల సొంతింటి కల సాకారం తో ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరించి, కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ 4520 డబల్ బెడ్ రూం ఇండ్లను నాణ్యతతో నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్ లో చేరానని, ముఖ్యమంత్రి సహకారం తో జగిత్యాల మరింత అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు కాగా, జగిత్యాల రూపు రేఖలు మార్చే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు.నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు కాలనీలో స్కూల్, అంగన్వాడి కేంద్రాలను, గుడి, కమ్యూనిటీ హాల్, బస్టాండు అనేక మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రంగు మహేష్, ములసపు మహేష్, ప్రవీణ్ రావు, నిమిష కవి వంశీబాబు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.