Take a fresh look at your lifestyle.

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి

  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
  • విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం “పోలీస్ పాఠశాల_ యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” పేరుతో వినూత్న కార్యక్రమం.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చుఅనే ఉద్దేశంతో “పోలీస్ పాఠశాల- యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలకు ఇప్పుడు సరైన అవగాహన కల్పిస్తే, మన భవిష్యత్తు వారికి, రేపటి సమాజం మరింత భద్రమవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారుల్లో రోడ్డు నియమాల పట్ల చైతన్యం పెంపొందించడం, విద్యార్థులపై జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడం, విద్యార్థులను వారి ఇంట్లో, సమాజంలో ట్రాఫిక్ భద్రత వారియర్స్ గా మారేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఐటికోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.