Take a fresh look at your lifestyle.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత లైసెన్స్

  • ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క యువతీ యువకులకు ఉచితంగా వాహనాన్ని నడిపేందుకు లైసెన్స్ అందజేస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన లైసెన్సుల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో లెసన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు.గత సంవత్సరంలో ఐక్యత ఫౌండేషన్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని అనివార్య కారణాల లైసెన్స్ లు అందించే ప్రక్రియ కొంచెం ఆలస్యం కావడం జరిగిందని, దరఖాస్తు పెట్టుకొని లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకున్న వాళ్లందరికీ ఉచితంగా లెర్నింగ్ లైసెన్స్ అందిస్తున్నామని అన్నారు. ల్వకుర్తి మండలంలో దాదాపు 90 మందికి పైగా లెర్నింగ్ పత్రాలు అందజేశామని,మండలాల వారిగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.నియోజకవర్గం మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు.కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీసా బాలరాజ్, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,నంబి ఇస్తారీ,విజేందర్ రెడ్డి, మధు, పరమేష్, వినోద్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎముకరవి, ఐలెన్, మహేందర్,యువజన నాయకులు శివప్రసాద్, పర్షపాకుల రమేష్, మాలిక్ లతో పాటు ఫౌండేషన్ సభ్యులు గణేష్, శ్రీపతి, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.