ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వరుసకు అన్నదమ్ములు గొడ్డలితో నరకడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 3:30 నిమిషాలకు చనిపోవడం జరిగింది. అంతకుముందే భూమికీ సంబంధించిన పంచాయతీ ఉండటంతో గత మంగళవారం కావాలని పంచాయతీ పెట్టుకుని మృతి అన్న మల్లయ్య పై తోటకూరి మల్లెష్ తండ్రి బాల నర్సయ్య ఇంకొంత మందితో కలిసి పంచాయతీ పెట్టుకోగా తోటకూరి బాలయ్య కుమారుడు అజయ్ మృతుడు మల్లేష్ అన్నను బైక్ మీద ఎక్కించుకుని పంచాయతీ జరిగిన స్థలంలో తీసుకుని వెళ్లగా కావాలనే ఉద్దేశంతో మల్లేష్ అనే వ్యక్తి తమ అమ్మ శంకరమ్మ తో గొడ్డలి తెపించుకొని వెనుకనుండి వచ్చి ఎలాంటి సంబంధం లేని భాను పై దాడి చేయడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బందువులు తెలిపారు. భాను మృతికి కారణమైన తోటకూరి మల్లేషం తండ్రి బాల నర్సయ్య, తోటకూరి సరమంద తండ్రి తొటకూరి బాలయ్య తండ్రి బాల నర్సయ్య, తోటకూరి అజయ్ తండ్రి బాలయ్య, శంకరమ్మ భర్త బాల నర్సయ్య లపై క్రీమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగ మృతునికి భార్య శ్రీలత ఇద్దరు కుమారులు అనిల్ కుమార్, కన్నయ్య లు ఉన్నారు. వడపర్తి మెయిన్ రోడ్డు పై ధర్నా. మృతి చెందిన భాను కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వడపర్తి మెయిన్ రోడ్డు పై ధర్నా చేశారు.
