ముద్ర,రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని శ్రీ గ్రీన్ వుడ్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు ముందస్తు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు వేషధారణలో సంస్కృతిగా కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాముని జీవితం అందరికీ ఆదర్శమని రామాయణం అందరు విద్యార్థులు చదవదగ్గ గొప్ప మహా కావ్యమని భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం.24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో, హిందూ ధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు,అన్నదమ్ములు,యజమాని-సేవకులు మిత్రులు,రాజు-ప్రజలు,భగవంతుడు-భక్తుడు-వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు,ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి.చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తారు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యజ్ఞశ్రీ, అనిత, ప్రధానోపాధ్యాయులు రాజేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు,పిల్లలు పాల్గొన్నారు.
