Take a fresh look at your lifestyle.

గంగానగర్ మిలీనియం బ్లాకులో జిఎం పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని గంగానగర్ మిలీనియం బ్లాక్ లో శుక్రవారం ఆర్ జి 1 ఏరియా జయం లలిత్ కుమార్“జిఎం పాదయాత్ర” కార్యక్రమం లో పాల్గొన్నారు.ఆర్జీ 1 జియం డి.లలిత్ కుమార్ గంగానగర్ మిలీనియం బ్లాక్ లో ఉద్యోగుల వసతులు సంక్షేమంలో భాగంగా “జిఎం పాదయాత్ర” కార్యక్రమం నిర్వహించారు.ఆర్.జి. 1 జిఎం డి.లలిత్ కుమార్,గుర్తింపు సంఘం నాయకులు,అధికారులు కలిసి ఉద్యోగుల క్వార్టర్ల లలో అందుతున్న సదుపాయాలను, క్వార్టర్ లలో సానిటేషన్, త్రాగునీటి సరఫరా,సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ సంబందించిస్వయంగా ఉద్యోగులను,వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతున్నదా లేదా క్వార్టర్ లలో సానిటరీ సంబందించిన సమస్యలు ఆరాధిశారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా అంతరాయాలు కలిగిన క్వార్టర్ల లలో ఏమైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు రావాలని జిఎం తెలియజేశారు.పరిసరాలలో చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.కంపెని కార్మికుల సంక్షేమం కోసం అనేక వససులు,సదుపాయాలూ కల్పిస్తుందని అన్నారు.ఉద్యోగుల క్వార్టర్ లలో అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించుటకు కంపెని ఎల్లప్పుడూ ముందు ఉంటుందని జిఎం తెలిపారు.కార్మికుల క్వార్టర్ లలో సానిటేషన్,విద్యుత్,త్రాగునీటి సరఫరా,సివిల్,ఎలక్ట్రికల్ సంబందించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబందిత అధికారులను జిఎం ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ కె.స్వామి, డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐ.టి.యు.సి బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోశం,రంగు శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వర్ రావు,డిజీఎం వర్క్ షాప్ జితేందర్ సింగ్,ఎస్.సి సివిల్ వర వరప్రసాద్,ఎన్విరాన్ మెంట్ ఆంజనేయ ప్రసాద్,పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి,ఫారెస్ట్ అధికారి కర్ణ,సీనియర్ పిఒ హనుమంత రావు,సెక్యురిటి అధికారి వీరారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.