Take a fresh look at your lifestyle.

వెన్నెల డ్యాన్స్ అకాడమి ఉగాది సంబరాలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ కు చెందిన వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టు కున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ప్రతి యేటా ఉగాది ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. నిర్మల్ పట్టణంలో ఎంతో మందిని కళాకారులుగా తీర్చిదిద్దుతూ అందరి మన్నలను పొందుతున్నారన్నారు . ఈ తెలుగు నూతన సంవత్సరంలో మరింత మంచి డ్యాన్స్ శిక్షణలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రంలో కౌన్సిలర్ ఎస్పి రాజు, లక్కాకుల హరీష్, అడప పోశెట్టి కాంగ్రెస్ పార్టీ పట్టణధ్యక్షులు నాందేడపు చిన్ను, అడప పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.