ముద్ర పెబ్బేర్;
శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,వనపర్తి రాజవంశీయులు రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో నుంచి పల్లకిలో ఊరేగింపుగా రథం వద్దకు చేర్చారు.
రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరంగాపురం గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని,
ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని రూ 5 కోట్లతో టూరిజం హబ్బుగా మార్చనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
రూ. 2 కోట్ల రూపాయలతో ఆలయానికి సంబంధించిన ప్రధాన రహదారిని బాగు చేయనున్నట్లు ఆయన తెలిపారు.1 కోటి 50 లక్షల రూపాయలతో అతిథి గృహాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. 24 కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో శ్రీ రంగనాయక సముద్ర వెనకాల ఉన్న పంట పొలాలలోని కాలువలను బలోపేతం చేసేందుకు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దిలేటి వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, శ్రీరంగపురం మండల నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి,పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.