‘ఎర్రబెల్లి’ది నీచబుద్ది
అందుకే రేవంత్ పార్టీలో రానివ్వలేదు
స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం
ముద్ర, వరంగల్ :
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ ది నీచ బుద్ధి అని స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వలేదని న్నారు. ఆదివారం వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రబెల్లికి సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి లేదని దుయ్యబట్టారు. చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదన్నారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారని హోల్ సేల్ గా టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్‍కు అమ్మిన చరిత్ర ఆయనదని విమర్శించారు. గజ దొంగ రాజయ్యకు తోడుగా మరో ముగ్గురు స్టువర్టు పురం దొంగలు తోడయ్యరాని ఆరోపించారు. 2023లో రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్‍కు ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారని ఆరోపించారు. మున్సిపాలిటీని గెలిపించే పరిస్థితి రాజయ్యకు లేదని కేసీఆర్ కు చెప్పి ముగ్గురు స్టేషన్ ఘన్ పూర్ కు ఇన్ చార్జీలుగా ఉండి రాజయ్యను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.