- పీయేసీ ఛైర్మెన్ అరికపూడి.
మాదాపూర్, ముద్ర : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద 4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో జరుగుతున్న నాల విస్తరణ పనులను,మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు కల్వర్ట్ నిర్మాణము పై మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరుతుందని చైర్మన్ గాంధీ తెలియచేశారు.వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE Gkd ప్రసాద్ , DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎల్లమయ్య, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, అంజాద్ పాషా, హమీద్, రాహుల్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.