- నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. చంద్రయ్య.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రం లో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘము గత 11 సంవత్సరంలో నుండి నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షలుగా కొనసాగుతున్నారని, అదే కార్యవర్గాన్ని కొనసాగించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారి చేసినట్లు నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. చంద్రయ్య తెలిపారు. ఈ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కలిసి వివరించినట్లు ఆయన తెలిపారు. మే 3, 2015న తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జగిత్యాల జిల్లా సంఘంకు ఎంలాంటి ముందస్తు నోటిసు ఇవ్వకుండానే కే .అరుణ ఆధ్యక్షరాలిగా నూతన జిల్లా కార్యవర్గమును ఏర్పాటు చేశారని, యూనియన్ బైలా ప్రకారం జిల్లా అధ్యక్షుడు బి. చంద్రయ్య అధ్యక్షడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో అప్పీలు చేయగా జూన్ 20, 2025 స్టేటస్ కో ఉత్తర్వులు జారి చేస్తూ బి.చంద్రయ్య ను అద్యక్షులుగా,కార్యవర్గం అక్టోబర్ 18,2025 వరకు కొనసాగ వలెనని ఉత్తర్వులు జారి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహా అధ్యక్షుడు ముజాహిద్ ఖాన్, ఉపాధ్యక్షులు పిల్లి శ్రీను, గంగరాజు,చిన్న నర్సయ్య, కార్యదర్శి ఎల్లా వేణు, సహాయ కార్యదర్శి ఎండీ యూసఫ్, కోశాధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.