Take a fresh look at your lifestyle.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యం ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ పోస్టర్ల విడుదల

 

ముద్ర , నారాయణపేట:

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యమని బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని డోకూరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 24 వరకు పార్లమెంట్ పరిధిలో ఐదు రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా క్రీడాకారులు ఆట పేరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నారాయణపేట జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమవుతుందని ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటాలని కోరారు. అనంతరం క్రీడాకారుల రిజిస్ట్రేషన్ కోసం క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రతంగ్, కౌన్సిలర్లు సత్య రఘుపాల్, కమలాపూర్ ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు పోశల్ వినోద్, రఘురామయ్య గౌడ్ , లక్ష్మీ శ్యాంసుందర్, మిర్చి వెంకటయ్య, బిల్డర్ వెంకట్ రాములు, సుంకు ఉమేష్, రఘువీర్, సాయి బన్న, డగే కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.