- కార్యకర్తలతో కలిసి వెళ్ళిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శ్రేణులు భారీగా తరలివెళ్లారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తారలు.ఈ భారీ ర్యాలీని భువనగిరి పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినదని అన్నారు. రాష్ట్ర సాధన లక్ష్యాన్ని ఛేదించి, తెలంగాణ రాష్ట్రం పురోగతిలో గత పదేళ్లు అధికారంలో ఉంది పాటిపడిందని చెప్పారు.కేసిఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకలలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని గ్రామాల్లో పార్టీ జెండాలను గ్రామ శాఖ అధ్యక్షులు ఎగరవేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వాహనాలలో ఎల్కతుర్తి మహాసభకు తరలివెళ్లారు. రజతోత్సవ సభకు తరలిన వారిలో మాజీ ఎంపీపీ కృపేశ్, రైతు బంధు జిల్లా మాజీ అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు దండెం రాంరెడ్డి, పల్లె గోపాల్ గౌడ్, రమేష్ గౌడ్, బుగ్గరాములు, కార్యకర్తలు ఉన్నారు.