- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
ముద్రప్రతినిధి,జగిత్యాల:అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజును పురస్కరించుకొని బుధవారం పుణ్యావాచన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని బ్రాహ్మణులలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి విద్యా మందిరం ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపినారు. అంతేకాకుండా ధ్యాన మందిరము ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే దాన్ని తొలగించడానికి సంబంధిత అధికారులకు తెలియజేసి శిథిలావస్థ నిర్మాణాన్ని తొలగించాలన్నారు.రాబోయే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నిర్మాణ తొలగింపుకు కలెక్టర్ కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో ఈవో సురేందర్ ఎండోమెంట్ ఉన్నతాధికారులకు తెలియజేసి శిథిలావస్థ శిథిలాలను తొలగించాలని సూచించారు. మునుముందు ధ్యాన మందిరం కు కావలసిన అవస్థాపన సౌకర్యాల కోసం తన వంతు కృషి చేస్తానని, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా దాతల సహకారం పొంది ధ్యాన మందిరం అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల శ్రీనివాస్, మోతే ఉమాకాంత్ శర్మ, మందిరం భారవి శర్మ ,మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, చంద్రశేఖర్, శ్రీధర గణపతి , పార్థసారథి శర్మ, సిరిసిల్ల వేణుగోపాల్, శ్రీనివాస్, కార్తీక్, కిరణ్, ఈవో సురేందర్, వార్డు నాయకులు అను మల్ల రఘు, భాస్కర్ శర్మ రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
