ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన యువకుడు బీచుపల్లి స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఐడిఓసీ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా బీచుపల్లి ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసేందుకు పరిశ్రమల శాఖ నుంచి తనకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనం నాణ్యత, భద్రతను సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్ట్రికల్ వాహన తయారీ అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. విధివిధానాలను అనుసరించి వాహనాల తయారీకి సహకారంపై పరిశీలించాలని ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్ కు తెలిపారు.