Take a fresh look at your lifestyle.

ఇంటర్ ఫలితాల్లో ‘ప్రతిభ ‘ ప్రభంజనం

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్ష ల్లో ‘ ప్రతిభ’ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అద్భుత విజయం సాధించారు. ఎంపీసీ, బైపిసి విభాగాల్లో రికార్డు స్థాయి ఫలితాలు నమోదయ్యాయి.
…………………………………….
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ….
………………………………………
ఎంపీసీ విభాగం నుంచి
కె. రిషిక, ఆర్. రిషిత విద్యార్థినిలు 468/470 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. కె. చందన, స్నేహిత తదితరులు 467, 468 మార్కులతో ప్రతిభ చాటారు. బైపిసి విభాగం నుంచి
డి. మానస 437/440 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. పలువురు విద్యార్థులు 435,438 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
…………………………………..
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో
…………………………………….
ఎంపీసీ విభాగం నుంచి
ఇ. వైష్ణవి 994/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. యు. వైష్ణవి, డి. హర్షిత, కె. రాఘవి 993 మార్కులు సాధించగా, మరికొందరు విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించారు.
బైపిసి విభాగం నుంచి
కె. వైష్ణవి 992/1000, పి. సుప్రజ 991/1000 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
ప్రథమ సంవత్సరం
ఎంపీసీ బైపిసి విభాగాల్లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 432 మంది ఉన్నారు.
ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపిసి విభాగాల్లో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 508 మంది ఉన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, సహకరించిన తల్లిదండ్రులను ప్రతిభ కళాశాల సలహాదారులు కె. మంజులాదేవి, వి. లక్ష్మారెడ్డి, కె. విష్ణువర్ధన్ రెడ్డి, కె. రఘువర్ధన్ రెడ్డి, కె. జనార్దన్ రెడ్డి, జి. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.