- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
- మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎస్ ఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు. బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా,షీ టీమ్స్,ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు. ఎస్పి వెంట ఎస్.ఐ లు రాజు ,సుదీర్ రావు,సిబ్బంది ఉన్నారు.
