Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదం లో ముగ్గురి దుర్మరణం – కల్వర్టు ను ఢీ కొన్న క్రూజర్ వాహనం

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కోదాడ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్రూజర్ వాహనంలో వెళుతుండగా ఊర్కొండ మండలం తిమ్మనపల్లి గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనానికి వెళ్తూ ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.