Take a fresh look at your lifestyle.

బడ్జెట్ పాఠశాలలకు సహకరించండి

  • డీఈఓ కు ట్రస్మా వినతి.

ముద్ర ప్రతినిధి,మేడ్చల్: బడ్జెట్ స్కూళ్ల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల యాజమాన్యాలకు సహకరించాలని మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారిని ట్రస్మా నేతలు కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఈఓ విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రస్మా నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి గిరిబాబులు ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. అనంతరం ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బడ్జెట్ పాఠశాలను ఇబ్బందులు పెట్టే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వీటిపట్ల తల్లిదండ్రులు అప్రమత్తమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా నాయకులు గడ్డమీది బాలరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.