ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మండల ప్రణాళిక గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేయబోయే ప్రణాళికలలో భాగంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు జనాభా లెక్కలు ఉపయోగపడతాయని తెలిపారు. జనగణన విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. ఈ సీపీవో, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.